Aravind Kejriwal: పోలింగ్ ముగిసినా ఓటింగ్ శాతం ప్రకటించని ఈసీ... ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్

  • ఢిల్లీలో నిన్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • ఈసీ వైఖరి దిగ్భ్రాంతికరం అని పేర్కొన్న కేజ్రీవాల్
  • ఎన్నికల సంఘం ఏంచేస్తోందని ట్విట్టర్ లో ఆగ్రహం

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ నిన్న జరిగింది. అయితే సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ శాతం వెల్లడించడం ఆనవాయితీ. కానీ ఎంత శాతం ఓటింగ్ నమోదైందన్న విషయాన్ని పోలింగ్ ముగిసిన తర్వాత రోజు కూడా ఎన్నికల సంఘం వెల్లడించకపోవడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఈసీ వైఖరి దిగ్భ్రాంతి కలిగిస్తోందని కేజ్రీ ట్విట్టర్ లో స్పందించారు.

ఇప్పటివరకు పోలింగ్ తుది పర్సంటేజీని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఉందా? లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఆ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. వాటిలో అత్యధికం ఆమ్ ఆద్మీ పార్టీకే జై కొట్టాయి. కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

More Telugu News