Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్: నత్తనడకన సాగుతున్న భారత్ బ్యాటింగ్

  • పోచెఫ్ స్ట్రూమ్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య టైటిల్ పోరు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లా బౌలర్లు
  • బంతులు తినేస్తున్న భారత బ్యాట్స్ మెన్

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు పోచెఫ్ స్ట్రూమ్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ నిర్ణయం సబబే అని నిరూపిస్తూ బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దాంతో భారత కుర్రాళ్లు పరుగులు తీసేందుకు చెమటోడ్చుతున్నారు.

ధాటిగా ఆడతాడని పేరున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ 20 పరుగులు చేసేందుకు 43 బంతులు ఆడగా, మరో ఓపెనర్ 17 బంతులాడి కేవలం 2 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత కుర్రాళ్ల జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్ మ్యాచ్ ను ఇదే మైదానంలో ఆడి ఎంతో దూకుడుగా ఆడిన భారత్ ఈసారి ఆచితూచి ఆడుతోంది.

More Telugu News