Bollywood: 'ఇలాగేనా సినిమా తీసేది?' అంటూ థియేటర్‌లో దర్శకుడిని పట్టుకుని తిట్టి.. కన్నీరు పెట్టుకున్న అమ్మాయి.. వీడియో వైరల్

  • ఢిల్లీలో ఘటన
  • ‘శిఖర’ చూస్తూ యువతి భావోద్వేగం
  • సినిమా థియేటర్‌కు వచ్చిన దర్శకుడు
  • కశ్మీర్‌ పండిట్ల బాధలు చూపలేదని తిట్టిన అమ్మాయి

కశ్మీర్‌లో గతంలో పండిట్ కుటుంబాలు ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా ‘శిఖర’ అనే సినిమాను తీశారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా పట్ల ఓ వర్గం నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన ఓ యువతి.. దర్శకుడిపై విరుచుకుపడిన దృశ్యాలు మీడియాకు లభ్యమయ్యాయి.  

కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి ఇటీవల ఢిల్లీలోని ఓ థియేటర్‌ ఈ సినిమా చూడడానికి వెళ్లింది. అదే సినిమా థియేటర్‌లో దర్శకుడు వినోద్ చోప్రా కూడా కూర్చొని సినిమా చూస్తున్నారు. సినిమా ప్రదర్శన కొనసాగుతుండగా ఆ యువతి లేచి నిలబడి దర్శకుడిని తిట్టింది.

ఈ సినిమాను డబ్బు కోసమే తీశారని, 1990లో కశ్మీర్ పండిట్లు ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోవడానికి గల కారణాలను చూపలేదని అరుస్తూ చెప్పింది. సామూహిక అత్యాచారాలు, హత్యల గురించి చూపలేదని వాపోయింది. కశ్మీర్‌ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని కొంచెం కూడా చూపలేదని చెప్పింది. ఓ వర్గానికి అనుకూలంగా ఈ సినిమా తీసినట్లు ఉందని ఆరోపించింది. ఇలాగేనా సినిమా తీసేది? అంటూ నిలదీసి, ఆ తర్వాత తన సీటులో కూర్చొని కన్నీరు పెట్టుకుంది.

దీంతో వినోద్ చోప్రా స్పందించారు. ఆ యువతి కోసమే తాను ఈ సినిమా సీక్వెల్ ను తీస్తానని చెప్పాడు. ఒకే విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడం సహజమేనని తెలిపారు. ఈ సినిమా ఈ నెల 7న విడుదలై, మిశ్రమ స్పందనను రాబట్టింది. ఈ సినిమా విడుదలకు ముందు కూడా అనేక వివాదాల్లో చిక్కుకుంది.

More Telugu News