AB Venkateshwara Rao: జగన్ సర్కారు సంచలన నిర్ణయం... మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్

  • 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఏబీ వెంకటేశ్వరరావు
  • విధి నిర్వహణలో అధికార దుర్వినియోగం
  • విచారణ తరువాతే సస్పెండ్ చేశామని సీఎస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన 1989 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు నిన్న రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధినిర్వహణలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆధారాలు లభ్యమైనందునే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కాగా, గతంలో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం, కొన్నాళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించామని, అవినీతిపై ఆధారాలు లభ్యమైనందునే సస్పెండ్ చేశామని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో చీఫ్ సెక్రెటరీ నీలం స్వాహ్నీ వెల్లడించారు.

More Telugu News