Varla Ramaiah: వైసీపీది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం: వర్ల రామయ్య

  • అవినీతిపై ఎక్సైజ్ శాఖ మంత్రి చర్చకు రావాలని సవాల్  
  • రూ.5 వేల ఆదాయం దాటితే రేషన్ కార్డులను రద్దు చేస్తారా?
  • తనపై కేసులున్నట్లే.. పేదవారిపై కేసులు ఉండాలని జగన్ భావిస్తున్నారేమో  

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వమన్నారు. ఐదువేల రూపాయల ఆదాయం దాటితే రేషన్ కార్డులను రద్దు చేయడమేంటని ప్రశ్నించారు. అవినీతిపై ఎక్సైజ్ శాఖ మంత్రి చర్చకు రావాలని సవాల్ చేశారు. జే ట్యాక్స్ రాదు కాబట్టే తెల్ల రేషన్ కార్డులను ఏరివేస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు, లోకేశ్ కు భద్రత తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనపై కేసులున్నట్లే, పేదవారిపై కేసులు ఉండాలని జగన్ భావిస్తున్నారేమోనంటూ వర్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ విధానాలను చూసి పారిశ్రామిక వేత్తలు పలాయనం బాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాల దిగజార్చడానికే జగన్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందన్నారు.

More Telugu News