Gopi Chand: కబడ్డీ కోచ్ 'జ్వాలా రెడ్డి'గా తమన్నా ఫస్టులుక్

  • గోపీచంద్ కథానాయకుడిగా 'సీటీమార్'
  • 'జ్వాలా రెడ్డి' పాత్రలో తమన్నా 
  • కబడ్డీ నేపథ్యంలో నడిచే కథ

సుదీర్ఘ కాలంగా తమన్నా తన కెరియర్ ను కొనసాగిస్తోంది. కొత్త కథానాయికల పోటీని తట్టుకుంటూ, వైవిధ్యభరితమైన పాత్రలను దక్కించుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఆమె తాజా చిత్రంగా 'సీటీమార్' రూపొందుతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

కథానాయికగా .. కబడ్డీ టీమ్ కి కోచ్ గా తమన్నా ఈ సినిమాలో కనిపించనుంది. తాజాగా ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను ఈ సినిమా టీమ్ విడుదల చేసింది. 'జ్వాలారెడ్డి'గా తమన్నా పాత్రను పరిచయం చేశారు. 'ఒక ఫైర్ .. కబడ్డీ కోచ్ అయితే ఇలా ఉంటుంది' అంటూ ఈ చిత్ర బృందం ఈ ఫస్టులుక్ ను షేర్ చేసింది. ఇటీవల కాలంలో గోపీచంద్ చేసిన సినిమాలు వరుసగా ఆయనను నిరాశ పరుస్తూ వచ్చాయి. ఈ సినిమాతోనైనా ఆయన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

More Telugu News