Raj Tarun: ఆసక్తిని రేపుతున్న 'ఒరేయ్ బుజ్జిగా' ప్రీ లుక్

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'ఒరేయ్ బుజ్జిగా'
  • ఆకట్టుకుంటున్న ప్రీ లుక్ 
  •  సోమవారం రోజున ఫస్టులుక్ రిలీజ్

రాజ్ తరుణ్ కి కొంతకాలంగా హిట్ పడలేదు. 'ఇద్దరి లోకం ఒకటే' పై ఆయన పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన చేసిన మూవీనే 'ఒరేయ్ బుజ్జిగా'. గతంలో 'గుండెజారి గల్లంతయ్యిందే'తో విజయాన్ని అందుకున్న విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నాయికలుగా మాళవిక నాయర్ .. హెబ్బా పటేల్ నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 10వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారిక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రాజ్ తరుణ్ కి హిట్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News