Andhra Pradesh: తొలగించిన పెన్షన్ల రీవెరిఫికేషన్ కు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం

  • పెన్షన్ ఖాతాలు తొలగించారంటూ ఏపీలో విమర్శలు
  • స్పందించిన జగన్ సర్కారు
  • రేపటి నుంచి 4.80 లక్షల ఖాతాల వెరిఫికేషన్ కు నిర్ణయం

ఏపీలో భారీ సంఖ్యలో పెన్షన్లు తొలగించారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. తొలగించిన పెన్షన్ ఖాతాల రీవెరిఫికేషన్ జరపాలంటూ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో రేపటి నుంచి 4.80 లక్షల పెన్షన్ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలగించిన వారిలో ఎవరైనా అర్హులు ఉన్నట్టు గుర్తిస్తే వారికి గత నెల పెన్షన్ తో కలిపి మొత్తం రెండు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించారు.

More Telugu News