KCR: ‘జేబీఎస్-ఎంజీబీఎస్’కు ‘మెట్రో’ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

  • జేబీఎస్ స్టేషన్ లో ‘మెట్రో’ కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్
  • ‘ఎంజీబీఎస్’ వరకు ప్రయాణించిన కేసీఆర్, మంత్రులు
  • ‘జేబీఎస్-ఎంజీబీఎస్’ మార్గంలో మొత్తం 9 స్టేషన్లు  

హైదరాబాద్ లో మెట్రో రైల్ సేవలు విస్తృతమయ్యాయి. జేబీఎస్-ఎంజీబీఎస్ (కారిడార్-2) వరకు ‘మెట్రో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ‘జేబీఎస్-ఎంజీబీఎస్’ మెట్రో సర్వీస్ ను సీఎం ఇవాళ కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్ స్టేషన్ లో ‘మెట్రో’ కు కేసీఆర్ పచ్చజెండా ఊపారు. అనంతరం, మెట్రో రైలులో ఎంజీబీఎస్ స్టేషన్ వరకు కేసీఆర్, మంత్రులు, అధికారులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ‘మెట్రో’ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, ‘జేబీఎస్-ఎంజీబీఎస్’ వరకు 11 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. ‘జేబీఎస్-ఎంజీబీఎస్’ మెట్రో సర్వీస్ ప్రారంభం కావడంతో మెట్రో ప్రాజెక్టులో తొలి దశ పూర్తయినట్టయింది.తొలి దశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మార్గంలో 69 కిలోమీటర్ల మేరకు ‘మెట్రో’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో, దేశంలో రెండో అతిపెద్ద నెట్ వర్క్ గా హైదరాబాద్ మెట్రో రికార్డు కెక్కింది.

More Telugu News