కీర్తి సురేశ్ 'మిస్ ఇండియా' నుంచి 'కొత్తగా కొత్తగా..' పాట!

07-02-2020 Fri 16:27
  • నరేంద్ర దర్శకత్వంలో వస్తున్న 'మిస్ ఇండియా'
  • 'మహానటి' తర్వాత తెలుగులో కీర్తి నటిస్తున్న చిత్రం ఇదే
  • 'కొత్తగా కొత్తగా' లిరికల్ వీడియోను విడుదల చేసిన చిత్రబృందం
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో 'మిస్ ఇండియా' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నరేంద్ర దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహానటి' తర్వాత కీర్తి సురేశ్ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'కొత్తగా కొత్తగా' అనే పాటను విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియోను ఆదిత్య మ్యూజిక్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. తమన్ సంగీత దర్శకత్వంలో ఈ పాటకు యువ గేయ రచయిత కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషాల్ పాడడం జరిగింది.