Pak Jail: కరుడుగట్టిన ఉగ్రవాది ఇషానుల్లా పాక్ జైలు నుంచి పరారీ

  • తప్పించుకున్నానంటూ.. ఆడియో టేప్ లో వెల్లడి
  • లొంగిపోయినప్పడు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చలేదన్న ఉగ్రవాది
  • నోబెల్ గ్రహీత మలాలాపై దాడిలో నిందితుడు

పాకిస్థాన్ భద్రతా దళాల కన్నుగప్పి తాను తప్పించుకున్నానని కరుడుగట్టిన ఉగ్రవాది ఇషానుల్లా ఎహ్సాన్ ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. మాజీ తాలిబన్ ప్రతినిధి అయిన ఈ ఉగ్రవాది పలు కేసులలో నిందితుడు.  

తాను గత నెల 11న తప్పించుకున్నానని ఎహ్సాన్ తన సందేశంలో చెబుతూ.. తాను లొంగిపోయినప్పుడు చేసిన హామీలను పాక్ బలగాలు నెరవేర్చలేకపోయాయని పేర్కొన్నాడు. కాగా, ఈ ఆడియో టేప్ ఉగ్రవాది ఎహ్సాన్ కు సంబంధించినదేనా? అన్న విషయాన్ని పాక్ ధ్రువీకరించాల్సి ఉంది.

మహిళల విద్యకోసం పోరాడుతున్న నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ పై 2012లో జరిగిన కాల్పుల ఘటనలో ఎహ్సాన్ హస్తముంది. అలాగే, 2014లో పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన ఉగ్ర దాడిలో ఎహ్సాన్ ప్రమేయం ఉందని తేలింది. ఈ దాడిలో 132 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 149 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News