Sensex: స్టాక్ మార్కెట్... నాలుగు రోజుల లాభాలకు బ్రేక్!

  • 164 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 39 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • కొనసాగుతున్న కరోనా వైరస్ భయాలు

గత నాలుగు రోజులుగా లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను చవిచూశాయి. వారాంతం కావడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు. దీంతో పాటు కరోనా వైరస్ కూడా మార్కెట్లపై కొంతమేర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 164 పాయింట్లు కోల్పోయి 41,141కి పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 12,098 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.30%), ఓఎన్జీసీ (1.91%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.36%), యాక్సిస్ బ్యాంక్ (1.21%), హీరో మోటో కార్ప్ (1.12%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.95%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.64%), టాటా స్టీల్ (-1.46%), ఎల్ అండ్ టీ (-1.40%).

More Telugu News