AAP: ఢిల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆప్‌లపై ఈడీ బాంబు!

  • పీఎఫ్ఐతో కాంగ్రెస్, ఆప్ నాయకులకు సంబంధాలు
  • పీఎఫ్ఐ ఖాతాల్లో రూ. 120 కోట్లు జమ
  • పీఎఫ్ఐ చీఫ్‌తో ఆప్ నేత సంజయ్‌సింగ్ సంప్రదింపులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బాంబు పేల్చింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు డబ్బులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయన్న దానిపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ తాజాగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నెత్తిన బాంబు వేసింది. సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనలకు పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) నిధులు సమకూరుస్తోందని ఆరోపించిన ఈడీ.. ఆ సంస్థ చీఫ్‌తో కాంగ్రెస్, ఆప్ నాయకులకు సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు తన దర్యాప్తు నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేసింది.

పీఎఫ్ఐ, రెహాబ్ ఇండియా ఫౌండేషన్‌కు సంబంధించి 15 బ్యాంకుల్లో ఉన్న 73 ఖాతాల్లో రూ.120 కోట్లు జమ అయినట్టు హోంశాఖకు సమర్పించిన దరఖాస్తులో ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, ఉదిత్ రాజ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులతో పీఎఫ్ఐ ఢిల్లీ అధ్యక్షుడు పర్వేజ్ అహ్మద్‌ సంప్రదింపులు జరిపారని ఈడీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

More Telugu News