GVL Narasimha Rao: ఏపీ రాజధానికి పరిష్కారం కోర్టులో లభించవచ్చు: జీవీఎల్

  • ఏపీ రాజధాని అంశంలో జీవీఎల్ వ్యాఖ్యలు
  • ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి మారబోదన్న జీవీఎల్
  • రాజధాని అమరావతేనని రాజకీయ తీర్మానం చేశామని వెల్లడి

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఓ తెలుగు వార్తా చానల్ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ చెప్పిన సమాధానంలో పూర్తి స్పష్టత ఉందన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమేనని పునరుద్ఘాటించారు. ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి మారబోదని స్పష్టం చేశారు. అయితే, పార్టీపరంగా ఏపీ రాజధాని అమరావతేనని తాము రాజకీయ తీర్మానం చేశామని చెప్పారు.

అమరావతి నుంచి రాజధానిని తీసేయాలని తమకేమీ కోరిక లేదని, కక్ష అంతకన్నా లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు అసలే లేవని, దీనిపై అపోహలు సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. అయితే ఈ అంశానికి కోర్టులో పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాబట్టి, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పిందని వివరించారు. ఈ వైఖరిని ప్రతిఘటించాలనుకుంటే ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.

More Telugu News