kuwait Tennis Tourny: కువైట్ టెన్నిస్ టోర్నీలో మెరిసిన తెలుగు తేజం హర్షిత

  • రఫెల్ నాదల్ చేతులుమీదుగా ట్రోఫీ స్వీకరణ
  • తల్లిదండ్రులతో కువైట్లోనే ఉంటోన్న బాలిక
  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థిని

కువైట్ లో నిర్వహించిన రఫా నాదల్ అకాడమీ టోర్నీలో భాగంగా అండర్ -16 టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయి హర్షిత చాంపియన్ గా నిలిచింది. నిన్న జరిగిన విజేతలకు ట్రోఫీలందించే కార్యక్రమంలో టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ పాల్గొని హర్షితకు ట్రోఫీ అందజేశారు.

పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంకు చెందిన హర్షిత తల్లిదండ్రులు బాలశివ శ్రీకాంత్ అడివి, మోహిని విమల కిరణ్. హర్షిత కువైట్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. శ్రీకాంత్ అక్కడి ఆయిల్ సంస్థలో పనిచేస్తున్నారు. చిన్నప్పటినుంచి చదువుతోపాటు టెన్నిస్ ఆటపట్ల మక్కువ పెంచుకున్న హర్షిత ఈ టోర్నీలో విజేతగా నిలిచి తెలుగు వారికి గర్వకారణం అయింది. ప్రస్తుతం రఫా అకాడమీ, షేక్ జబర్ అల్ అబ్దుల్లా అల్ జబర్ అల్ సబాహ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ కాంప్లెక్స్ తో పనిచేస్తోంది.

More Telugu News