Sammakka Arrival: మేడారం జాతర: గద్దె నెక్కడానికి బయలు దేరిన సమ్మక్క

  • చిలకల గుట్ట నుంచి బయలు దేరిన సమ్మక్క
  • సమ్మక్క నామస్మరణతో మార్మోగుతున్న మేడారం ప్రాంతం
  • జనసంద్రంగా మారిన జంపన్న వాగు

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందిన మేడారం జాతరలో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. అశేష జనసమూహం మధ్య చిలకల గుట్ట నుంచి సమ్మక్క మేడారానికి బయలుదేరింది. భక్తులు చేస్తున్న సమ్మక్క నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగుతున్నాయి. సమ్మక్క రాకకు సూచనగా ములుగు జిల్లా ఎస్సీ సంగ్రామ్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ గాల్లోకి కాల్పులు జరిపారు.

దీంతో భక్తులు ఒక్కపెట్టున సమ్మక్క నామస్మరణతో ముందుకు కదిలారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు నృత్యాలు చేస్తూండగా సమ్మక్క గద్దె నెక్కడానికి ముందుకు కదిలింది. మరోవైపు గుట్ట కింద మేడారం గద్దె పరిసర ప్రాంతాల్లో సమ్మక్క రాకకై భక్తులు ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగు జనసంద్రంగా మారింది.

More Telugu News