Devineni Uma: రూ.50 కోట్లు ఇస్తామన్నా షరీఫ్ వారికి లొంగలేదు: దేవినేని ఉమ

  • వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కోసం వైసీపీ అడ్డదారులు తొక్కిందన్న ఉమ
  • మండలి చైర్మన్ కు రూ.50 కోట్లు ఎర చూపారని ఆరోపణ
  • టీడీపీ ఎమ్మెల్సీలను సైతం ప్రలోభాలకు గురిచేశారని వెల్లడి

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరులో రైతులు చేపట్టిన దీక్షకు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల శాసనమండలిలో జరిగిన పరిణామాలపై స్పందించారు. వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు వైసీపీ వాళ్లు అడ్డదారుల్లో వెళ్లారని ఆరోపించారు. ఏకంగా మండలి చైర్మన్ షరీఫ్ నే ప్రలోభానికి గురిచేయాలని చూశారని, ఆయనకు రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. అయితే, షరీఫ్ లొంగలేదని కొనియాడారు. అటు, టీడీపీ ఎమ్మెల్సీలను కూడా భారీ మొత్తాలు ఆశచూపి తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించారని, కానీ మండలి చైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలు ప్రజల పక్షానే నిలిచారని ఉమ తెలిపారు.

More Telugu News