Puri Jagannadh: పూరి, విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ ఇదేనా?

  • షూటింగు దశలో విజయ్ దేవరకొండ మూవీ 
  • నిర్మాణ భాగస్వామిగా కరణ్ జొహార్ 
  • కథానాయికగా అనన్య పాండే పరిచయం

పూరి జగన్నాథ్ - చార్మీ కలిసి మరో సినిమాను నిర్మిస్తున్నారు. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయకుడిగా విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను అనుకున్నారు. ఆ తరువాతనే ఈ ప్రాజెక్టులోకి కరణ్ జొహార్ వచ్చి చేరడం, తెలుగుతోపాటు ఈ సినిమాను హిందీలోను విడుదల చేయాలనుకోవడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టైటిల్ మార్చే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. కథా పరంగా ఈ సినిమాకి 'లైగర్' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో కరణ్ - పూరి వున్నారని సమాచారం. మగ సింహానికీ .. ఆడపులికి పుట్టిన పిల్లను 'లైగర్' అంటారు. కథాపరంగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని భావించి సెట్ చేశారని అంటున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే పరిచయమవుతోంది.

More Telugu News