ఇలాంటి వార్తలు రాస్తున్నందుకు సిగ్గుపడాలి: 'కియా తరలింపు' వార్తలపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

06-02-2020 Thu 12:13
  • 'కియా' వార్తలను ఖండిస్తోన్న వైసీపీ నేతలు
  • కియా మోటార్స్  ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారం
  • వార్తల పేరుతో ఇటువంటి నిరాధార విషయాలను ప్రచారం చేస్తున్నారు 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా సంస్థ తరలిపోతోందని వస్తోన్న వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. మీడియాలో వస్తోన్న వార్తలు అసత్యమని చెప్పారు. 'ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్  ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్న రాయిటర్స్ ఇండియా సిగ్గుపడాలి. వార్తల పేరుతో ఇటువంటి నిరాధార విషయాలను ప్రచారం చేస్తోన్న జర్నలిస్టులను చూసి షాక్ అవుతున్నాను'  అని మండిపడుతూ ట్వీట్ చేశారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఆ సంస్థ ఉందంటూ రాయిటర్స్ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.