మరోసారి బాలకృష్ణ సరసన నయనతార

06-02-2020 Thu 11:46
  • బోయపాటితో మరోసారి బాలకృష్ణ 
  •  ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించనున్న నయన్

బాలకృష్ణ అభిమానులంతా ఆయన తాజా చిత్రంపైనే దృష్టి పెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన తాజా చిత్రం రూపొందనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నాయికగా శ్రియను ఎంపిక చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉంటుందట. ఆ పాత్ర కోసం నయనతారతో సంప్రదింపులు జరపడం, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని అంటున్నారు. కథలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార కనిపిస్తుందని చెబుతున్నారు. ఇటు నయనతార .. అటు శ్రియ ఇద్దరూ కూడా గతంలో బాలకృష్ణతో కలిసి నటించినవారే. భారీ విజయాలను అందుకున్నవారే. అలాంటి ఈ ఇద్దరూ బాలకృష్ణతో కలిసి నటించనుండటం విశేషం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.