తాగుబోతు తండ్రిని చితక్కొట్టి... రోడ్డుపై పడేసి చంపేసిన కూతురు

06-02-2020 Thu 11:45
  • రాజస్థాన్‌లో ఘటన
  • పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ మద్యం తాగుతోన్న తండ్రి
  • సహనం నశించి దాడి చేసిన కూతురు

ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉంటూ ప్రతిరోజు మద్యం తాగుతున్నాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కూతురిని వేధిస్తున్నాడు. అతడి చర్యలతో కూతురి సహనం నశించింది. తండ్రిపై దాడి చేసి, రక్తం వచ్చేలా కొట్టి రోడ్డుపై పడేసింది.. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్‌లోని విజ్ఞాన్‌ నగర్‌, అజ్మర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

మృతుడు అశోక్‌ కుమార్‌ ఓ సంస్థలో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవాడు. అతని భార్య, కుమారుడు గతంలోనే మృతి చెందారు. కూతుళ్లు యామిని, రాగిణికి పెళ్లిళ్లు జరిగాయి. అశోక్‌ రాగిణి ఇంట్లో ఉంటున్నాడు. రోజూ తాగొచ్చి గొడవ చేస్తుండడంతో, ఇక ఓపిక పట్టలేక రాగిణి తండ్రిని చితక్కొట్టి రోడ్డుపై పడేసింది. దాంతో అతను మరణించాడు. పోలీసులు రాగిణిని అరెస్ట్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు.