రక్షణ కల్పించాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్

06-02-2020 Thu 10:44
  • మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్‌’ సినిమా 
  • కోట్లాది రూపాయలు నష్టపోయామని పంపిణీదారుల ఆందోళన 
  • వారి నుంచి రక్షణ కల్పించాలన్న మురుగదాస్
  • నిన్న రజనీకాంత్ ఇంటి ముందు పంపిణీదారుల ఆందోళన

సౌతిండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘దర్బార్‌’ సినిమా వల్ల తాము కోట్లాది రూపాయలు నష్టపోయామని పంపిణీదారులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంపిణీదారులు నిన్న రజనీకాంత్ ఇంటి ముందు కూడా నిరసన తెలిపారు. రజనీకాంత్‌ను కలవడానికి వస్తే ఇందుకు ఆయన నిరాకరించారని ఆరోపించారు.

 ఈ క్రమంలో ఈ రోజు ఈ చిత్ర దర్శకుడు మురుగదాస్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించి సినిమా పంపిణీదారుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంది. మరోవైపు, పంపిణీదారులు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, రూ.200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన దర్బార్‌ సినిమా రూ. 250 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ పంపిణీ దారులకు నష్టాలు వచ్చాయి.