కన్నడలోకి రీమేక్ అవుతున్న 'జయం'

06-02-2020 Thu 10:14
  • తెలుగులో హిట్ కొట్టిన 'జయం'
  • తమిళ రీమేక్ కూడా హిట్ 
  •  హీరోగా ఎంట్రీ ఇస్తున్న కొత్త కుర్రాడు  

తెలుగులో ప్రేమకథా చిత్రాలలో ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించిన చిత్రంగా 'జయం' కనిపిస్తుంది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారానే, తెలుగు తెరకి నితిన్ - సదా పరిచయమైంది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించింది. తమిళంలోనూ ఈ సినిమాను ఇదే పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది.

మళ్లీ ఇంత కాలానికి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమకి ప్రవీణ్ పరిచయం కానున్నాడు. నటనలో శిక్షణ పొందిన తరువాతనే ప్రవీణ్ రంగంలోకి దిగాడట. కథాకథనాల్లోని బలం కారణంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందనే టాక్ కన్నడ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రవీణ్ మంచి కంటెంట్ తో ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పుకుంటున్నారు.