కరోనా మరణమృదంగం... 560 దాటిన మృతుల సంఖ్య!

06-02-2020 Thu 10:13
  • కొత్తగా 2,987 మందికి వైరస్
  • బాధితులతో నిండిపోయిన ఆసుపత్రులు
  • 27,300 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్, చైనాలో మరణమృదంగాన్నే సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటివరకూ 560 మంది వరకూ మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హుబే రాష్ట్రంలోనే 70 మంది వరకూ చనిపోయారని అధికారులు వెల్లడించారు. కొత్తగా 2,987 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 27,300 దాటింది. పలు ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. వైరస్ సోకిన వారిలో దాదాపు 1000 మందిని చికిత్స తరువాత డిశ్చార్జ్ చేసినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.