Nirbhaya: నిర్భయ దోషులకు హైకోర్టు వారం గడువు.. స్వాగతించిన నిర్భయ తల్లి

  • కేంద్రం పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
  • దోషులకు ఉరి తప్పదన్న విశ్వాసం కలిగింది
  • కోర్టు తీర్పుపై ఆశాదేవి హర్షం

నిర్భయ దోషులకు వారం రోజుల గడువు ఇస్తూ ఢిల్లీ హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పుపై బాధితురాలి తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. నిర్భయ దోషుల ఉరితీతపై ఉన్న స్టే ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు నిన్న కొట్టివేసింది. న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే, దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది.

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ తీర్పుతో దోషులకు ఉరితప్పదన్న నమ్మకం కలిగిందన్నారు. చట్టపరంగా దోషులకు ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వారికి వారం రోజుల గడువు ఇచ్చిందని, ఈ తీర్పుతో వారికి ఉరి తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు.

More Telugu News