ముగింపు దశలో 'మోసగాళ్లు'

06-02-2020 Thu 09:34
  • భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'మోసగాళ్లు'
  • ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు

ఒక వైపున హీరోగా ఆశించినస్థాయి విజయాలను అందుకోలేక, మరో వైపున నిర్మాతగా కొన్ని నష్టాలను చవి చూసిన మంచు విష్ణు, కొంత గ్యాప్ తీసుకున్నాడు. మంచి కథను ఎంపిక చేసుకుని రంగంలోకి దిగాడు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో 'మోసగాళ్లు' సినిమాను మొదలెట్టాడు.

ఒక భారీ స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ స్కామ్ వెనుక ఎవరున్నారనే మిస్టరీని ఛేదించే నాయకుడిగా విష్ణు కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'లాస్ ఏంజెల్స్' లో జరుగుతోంది. విష్ణు .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కథానాయికగా కాజల్ నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి కనిపించనున్నాడు. నవీన్ చంద్ర .. నవదీప్ ముఖ్య పాత్రలను చేస్తున్నారు. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు.