కోర్టు వాయిదాలకు హాజరుకాని నిందితురాలు స్వాతిరెడ్డి.. అరెస్ట్ చేసిన పోలీసులు

06-02-2020 Thu 08:52
  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన స్వాతిరెడ్డి
  • అప్పట్లో పెను సంచలనం
  • స్టేట్ హోంలో ఉంటున్న స్వాతి 

కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుంటున్న స్వాతిరెడ్డిని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుధాకర్‌రెడ్డి హత్యకేసులో స్వాతి నిందితురాలు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన స్వాతి.. జులై 2018లో బెయిలుపై విడుదలైంది. అయితే, ఆమెను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు స్టేట్‌హోంకు తరలించారు.

కేసు విచారణలో భాగంగా ఆమె కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో తీవ్రంగా పరిగణించిన నాగర్‌కర్నూలు జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో స్టేట్‌హోంలో స్వాతిని నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు.