Komatireddy Venkat Reddy: రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మా సిటీ.. అనుమతులు రద్దు చేయండి: కేంద్రమంత్రిని కోరిన కోమటిరెడ్డి

  • పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ
  • ఎకరం రూ. 8 లక్షలకు కొని కోటిన్నరకు అమ్ముకుంటున్నారు
  • కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి

రియల్ ఎస్టేట్ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తోందని, వెంటనే దీని అనుమతులు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఫార్మాసిటీ కోసం పేద రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి వద్ద ఎకరం భూమిని రూ.8 లక్షలకు కొనుగోలు చేసి కోటిన్నర రూపాయలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు.

ఫార్మా కంపెనీల కారణంగా చెరువులు, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ.. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మాసిటీ అనుమతులను రద్దు చేయాలని, ఫార్మాసిటీ పేరుతో జరుగుతున్న భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.

More Telugu News