Nirbhaya: నిర్భయ దోషి అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి

  • రాష్ట్రపతి క్షమాభిక్ష కోరిన అక్షయ్
  • ఇప్పటికే వినయ్ శర్మ పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి
  • ఇప్పుడు అక్షయ్ కుమార్ విషయంలోనూ అదే నిర్ణయం

నిర్భయ దోషుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. అంతకుముందు, మరో దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష కోరుతూ దాఖలైన పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే అక్షయ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పుడతనికీ అదే ఫలితం ఎదురైంది. మరోవారంలో నిర్భయ దోషుల న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవడం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆపై ఉరిశిక్ష అమలుపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఉరి అమలుపై స్టేని ఎత్తివేయలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ సర్కారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

More Telugu News