కోలుకున్న సోనియా... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

05-02-2020 Wed 21:48
  • ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సోనియా
  • శ్వాస, ఉదర సంబంధ సమస్యలతో బాధపడిన కాంగ్రెస్ అధినేత్రి
  • ఇప్పుడెలాంటి ప్రమాదం లేదన్న వైద్యులు
  • సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడి

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అస్వస్థతకు గురైన సోనియా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇప్పుడామె కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి అత్యవసర చికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. సోనియా గత కొన్నిరోజులుగా ఆరోగ్యం నిలకడ లేకపోవడం, శ్వాస, ఉదర సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఆమె బడ్జెట్ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు.