నాగార్జున కొత్త చిత్రం షూటింగ్ నిలిపివేసిన 'కరోనా వైరస్'!

05-02-2020 Wed 21:41
  • 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న నాగ్
  • థాయ్ లాండ్ లో కొత్త షెడ్యూల్
  • థాయ్ లాండ్ లోనూ కరోనా కేసులు
  • కరోనా ప్రభావం తగ్గేంతవరకు షూటింగ్ జరపరాదని నిర్ణయం!

టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అహిషోర్ సోలోమన్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ సయామీ ఖేర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో చిత్రీకరించాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. అయితే కరోనా వైరస్ ప్రబలడంతో థాయ్ షెడ్యూల్ ను వాయిదా వేసినట్టు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం తగ్గేవరకు థాయ్ లాండ్ వెళ్లరాదని 'వైల్డ్ డాగ్' చిత్రబృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావిత దేశాల్లో థాయ్ లాండ్ కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి.