తమిళ హీరో విజయ్ కు ఐటీ శాఖ షాక్.. ఏజీఎస్ గ్రూప్ నకు సమన్లు జారీ!

05-02-2020 Wed 20:29
  • ‘బిగిలి’ ఆదాయపు పన్నులు చూపని ‘ఏజీఎస్’
  • చెన్నై లోని ఏజీఎస్’ సంస్థల్లో ఐటీ దాడులు
  •  రూ.24 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం

తమిళ హీరో విజయ్ కు ఐటీ శాఖ నుంచి షాక్ తగిలింది. విజయ్ హీరోగా ఆయన సొంత నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్ టైన్ మెయింట్ గత ఏడాది ‘బిగిలి’ చిత్రాన్ని నిర్మించింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆదాయపు పన్నుల వివరాలను సరిగ్గా చూపకపోవడంతో చెన్నైలోని విజయ్ కు చెందిన సంస్థల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులకు దిగారు. రూ.24 కోట్ల నగదు, భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణకు రావాలని ఏజీఎస్ గ్రూపుకు ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ వార్తల నేపథ్యంలో విజయ్ ఇంటికి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు చేరుకుంటున్నారు.