Corona Virus: పుట్టిన కొన్ని గంటల్లోనే కరోనా బారినపడిన చిన్నారి

  • చైనాలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • అప్పుడే పుట్టిన పసిబిడ్డను కూడా వదలని మహమ్మారి
  • తల్లి ద్వారా బిడ్డకు సంక్రమించిందన్న వైద్యులు

ఆసియా అగ్రదేశం చైనాలో మహోత్పాతం అనే స్థాయిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇక్కడి వుహాన్ నగరంలో ఈ మహమ్మారి ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం 500 మంది వరకు మృత్యువాత పడ్డారు. వేలమంది వైరస్ సోకి ఆసుపత్రుల పాలయ్యారు.

ఇక అసలు విషయానికొస్తే, ఈ వైరస్ అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా సోకుతుందని ఓ ఘటన ద్వారా వెల్లడైంది. చైనాలో ఓ పసికందు ఈ భూమ్మీద అడుగుపెట్టిన కొన్నిగంటల్లోనే కరోనా బారినపడింది. ఆ చిన్నారికి తల్లి ద్వారా వైరస్ సంక్రమించిందని డాక్టర్లు తెలిపారు. దీన్ని వెర్డికల్ ట్రాన్స్ మిషన్ అంటారని, ప్రసవానికి ముందే తల్లికి కరోనా వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే, హార్బిన్ నగరంలో ఓ కరోనా బాధితురాలు బిడ్డకు జన్మనివ్వగా, ఆ బిడ్డకు వైరస్ సోకలేదని వెల్లడైంది.

More Telugu News