Team India: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియాను వదలని జరిమానాలు

  • ఇప్పటికే రెండు టి20ల్లో టీమిండియాకు జరిమానాలు
  • తొలి వన్డేలో 80 శాతం మ్యాచ్ ఫీజు కోత
  • స్లో ఓవర్ రేట్ పర్యవసానం
  • పొరబాటును అంగీకరించిన కోహ్లీ

కివీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు వరుస జరిమానాలు తప్పడంలేదు. ఇప్పటికే టి20 సిరీస్ లో చివరి రెండు మ్యాచ్ లలో స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు పాల్పడిన టీమిండియా, ఇప్పుడు వన్డే సిరీస్ లో కూడా అదే తరహా ఉల్లంఘనతో జరిమానాకు గురైంది. నాలుగో టి20 మ్యాచ్ లో 40 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించగా, ఐదో టి20లో 20 శాతం మ్యాచ్ ఫీజు కోత వేశారు.

ఇప్పుడు వన్డేలో మరింత షాకిచ్చారు. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటా పూర్తిచేయలేదంటూ ఏకంగా ఆటగాళ్ల ఫీజులోంచి 80 శాతం జరిమానా విధించారు. నిర్ణీత సమయానికి టీమిండియా 4 ఓవర్లు ఆలస్యమైనట్టు గుర్తించారు. ఒక్కో ఓవర్ కు 20 శాతం చొప్పున మొత్తం 80 శాతం జరిమానా వడ్డించారు. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ విచారణ జరపగా, టీమిండియా సారథి కోహ్లీ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ ఉండదు.

More Telugu News