డబ్బులెక్కడ ఉన్నాయంటారా? సిగ్గుంటే, సీఆర్డీఏ అకౌంట్ లో చూసుకోండి: జగన్ పై చంద్రబాబు ఫైర్

05-02-2020 Wed 19:26
  • రాజధాని అభివృద్ధి కోసం నాడు పిలుపు నిచ్చా
  • రూ.57 కోట్లు విరాళంగా వచ్చాయి
  • ఆ డబ్బంతా సీఆర్డీఏ అకౌంట్ లో ఉంది

టీడీపీ హయాంలో తాను ఇచ్చిన పిలుపు మేరకు రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రజలు రూ.57 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని చంద్రబాబునాయుడు గుర్తుచేసుకున్నారు. తుళ్లూరులో రైతులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధికి డబ్బులు ఎక్కడ ఉన్నాయని జగన్ ప్రశ్నిస్తున్నారని, సీఆర్డీఏ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని ‘సిగ్గుంటే, ఒక్కసారి చూసుకోమని సవాల్ విసురుతున్నాను’ అని చంద్రబాబు అన్నారు.

 అమరావతి అభివృద్ధి కోసం జోలె పట్టి తిరుగుతున్నామని, విరాళంగా వచ్చిన ప్రతి పైసాకు బాధ్యతగా ఉన్నామని, జవాబుదారీతనంతో, పవిత్రమైన భావనతో జేఏసీ పనిచేస్తోందని ప్రశంసించారు. మూడు రాజధానులకు మద్దతుగా ముఖ్యమంత్రి కూడా ఓ జేఏసీ ఏర్పాటు చేశారని, ఈ ముఖ్యమంత్రిని దుర్మార్గుడు అనాలా? ‘సైకో అనాలా? ఉన్మాది అనాలా?’ అని ప్రశ్నించారు.