నేను విన్నాను, నేను ఉన్నాను అని డైలాగ్స్ కొట్టే జగన్ కు పెన్షన్లు ఎత్తివేయడం సిగ్గనిపించడం లేదా?: నారా లోకేశ్

05-02-2020 Wed 19:15
  • ఓ దివ్యాంగుడి పెన్షన్ తీసేశారని లోకేశ్ ఆరోపణ
  • జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
  • పెన్షన్లు పునరుద్ధరించకపోతే ఉద్యమం చేపడతామని వెల్లడి

సందిరెడ్డి శేఖర్ అనే దివ్యాంగుడికి పెన్షన్ తీసివేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని డైలాగ్స్ కొట్టే జగన్ కు దివ్యాంగుల పెన్షన్లు ఎత్తివేయడం పట్ల సిగ్గుగా అనిపించడంలేదా? అంటూ మండిపడ్డారు. చివరికి దివ్యాంగులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ గారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని లోకేశ్ హెచ్చరించారు. రాష్ట్రంలో తొలగించిన 7 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలని, లేకపోతే మరో ఉద్యమం తప్పదని స్పష్టం చేశారు.