‘బిగిలి’ ఎఫెక్ట్.. తమిళ హీరో విజయ్ ని షూటింగ్ స్పాట్ లోనే విచారించిన ఐటీ అధికారులు!

05-02-2020 Wed 18:13
  • గత ఏడాది ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ కింద విడుదలైన ‘బిగిలి’
  • ఆదాయపు పన్నుల లెక్క చూపని ‘ఏజీఎస్’?
  • ప్రస్తుతం ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్న విజయ్

గత ఏడాది ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కింద తమిళ హీరో విజయ్ నటించిన చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాను రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని, ఇందుకు సంబంధించిన ఆదాయపు పన్నులను ‘ఏజీఎస్’ లెక్క చూపలేదన్న వార్తల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులకు దిగారు. హీరో విజయ్ ను ఐటీ అధికారులు ప్రశ్నించారు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా షూటింగ్ కడలూర్ జిల్లాలోని నైవేలీలో కొనసాగుతోంది. ఆదాయపు పన్ను అధికారులు షూటింగ్ స్పాట్ కు వెళ్లి విజయ్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ‘బిగిల్ ’కు రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకున్నారు వంటి విషయాలపై ఐటీ అధికారులు ప్రశ్నించారని సంబంధిత వర్గాల సమాచారం. దీనివల్ల దాదాపు ఐదు గంటల పాటు షూటింగ్ ఆగిపోయినట్టు సమాచారం. చెన్నైలోని  ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్ సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ హౌస్ లపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.