బాలీవుడ్లోను చేయాలనుంది: హీరో వరుణ్ తేజ్

05-02-2020 Wed 17:58
  • నా అభిమాన నటుడు షారుక్ 
  • బాలీవుడ్ నుంచి నాకు ఆఫర్లు వస్తున్నాయి
  • అన్నీ కుదిరితే చేస్తానన్న వరుణ్ తేజ్  
వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ, విజయాలను సొంతం చేసుకుంటూ వరుణ్ తేజ్ ముందుకు వెళుతున్నాడు. ఈ మధ్య చేసిన 'గద్దలకొండ గణేశ్' కూడా వరుణ్ తేజ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ సినిమాలో వరుణ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు.

నాకు షారుక్ అంటే ఇష్టం. ఒకసారి ఆయన చరణ్ అన్నయ్య ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆయనను దూరం నుంచి చూస్తూ అలాగే ఉండిపోయాను. ఆయనతో కలిసి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పాలనేది నా కోరిక. నాకు కూడా హిందీ సినిమాల్లో నటించాలని వుంది. ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే కథ .. కాంబినేషన్ .. డేట్లు ఇలా అన్నీ కుదరాలి. అలాంటి సమయమే వస్తే తప్పకుండా హిందీ సినిమా చేస్తాను" అని చెప్పుకొచ్చాడు.