మీ పార్టీ జెండా రంగులు మీవే అని చెప్పే ధైర్యం లేనప్పుడు ఎందుకు వేశారు?: జగన్ కు వర్ల రామయ్య ప్రశ్న

05-02-2020 Wed 17:20
  • ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై వర్ల విమర్శలు
  • ఆ రంగులు తమ పార్టీవి కావని కోర్టులో ఎందుకు బుకాయిస్తున్నారు?
  • మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా?

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసిన విషయమై సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. ‘ముఖ్యమంత్రి గారు! మీ పార్టీ జెండా రంగులు మీవే అని చెప్పే ధైర్యం లేనప్పుడు, ఆ రంగులు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు వేశారు?’ అని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ రంగులు తమ పార్టీవి కావని కోర్టులో ఎందుకు బుకాయిస్తున్నారు? మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.