ఈ నెలలోనే సర్ ప్రైజ్ చేయనున్న రాజమౌళి

05-02-2020 Wed 16:54
  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
  • త్వరలో వీడియోను వదిలే ఛాన్స్ 

రాజమౌళి తాజా చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్' కోసం ప్రేక్షక లోకమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా నుంచి, ఎలాంటి అప్ డేట్లు బయటికి రాకుండా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారికంగా ఎన్టీఆర్ - చరణ్ ఫస్టులుక్ పోస్టర్స్ కూడా రాలేదు.

ఈ విషయం అభిమానులను నిరాశకి గురిచేస్తుందని భావించిన రాజమౌళి, ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేకమైన వీడియోను వదిలే పనిలో వున్నారని అంటున్నారు. ఆ వీడియోకి సంబంధించిన షాట్స్ ను రాజమౌళి తనయుడు కట్ చేస్తుండగా, కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారట. ఎన్టీఆర్ - చరణ్ లుక్స్ ను రివీల్ చేస్తారో లేదో తెలియదుగానీ, ఇంట్రెస్టింగ్ విజువల్స్ తోనే ఈ వీడియోను విడుదల చేస్తారట. ఈ నెల 14న గానీ .. 21న గాని ఈ వీడియోను విడుదల చేయవచ్చని అంటున్నారు.