ఢిల్లీలో ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగమార్గం

05-02-2020 Wed 16:53
  • దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు
  • ఢిల్లీలో రాజ్యాంగ సంస్థలకు కొత్త భవనాలు
  • ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ప్రాజెక్టు రూపకర్త

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు ఉన్న రాజ్యాంగ సంస్థల భవనాలు, ప్రభుత్వ భవనాలను మార్చడానికి, కొత్త రూపు కల్పించడానికి సెంట్రల్ విస్టా పేరిట సరికొత్తగా రూపకల్పన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెంట్రల్ విస్టా ప్రణాళికలో భాగంగా ప్రధాని నివాసం నుంచి పార్లమెంటు వరకు సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నారు. తద్వారా సాధారణ ట్రాఫిక్ నుంచి ప్రధాని వంటి వీవీఐపీలను వేరు చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రధాని వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు వెళ్లే సమయంలో సామాన్యులు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. సెంట్రల్ విస్టాలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక టన్నెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ తెలిపారు. పైగా వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా వీలవుతుందని వెల్లడించారు.