Brahmaji: ఆ రోజున జరిగిన ఆ సంఘటనే నన్ను నటన దిశగా నడిపించింది: బ్రహ్మాజీ

  • అవి 'శంకరాభరణం' వచ్చిన రోజులు 
  • ఆ సినిమాను 12 సార్లు చూశాను
  • అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నానన్న బ్రహ్మాజీ

తెలుగు తెరపై విలక్షణమైన పాత్రలతో మెప్పించిన నటులలో బ్రహ్మాజీ ఒకరు. ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తను నటన వైపుకు రావడానికి గల కారణాన్ని గురించి ప్రస్తావించారు.

"మా నాన్నగారు తాసీల్దార్ .. ఆ సమయంలో సోమయాజులుగారు డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసేవారు. 'శంకరాభరణం' విజయాన్ని సాధించడంతో, ఏలూరులో ఆయనకి సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఆ వ్యవహారాలు మా నాన్నగారు దగ్గరుండి చూసేవారు. అప్పటికే మా చుట్టాలతో కలిసి నేను ఆ సినిమాను 12 సార్లు చూశాను. సోమయాజులుగారు వస్తే అందరూ ఆయనను ఒక దేవుడిలా చూస్తున్నారు .. ఆయన పాదాలకి నమస్కారాలు చేస్తున్నారు. అలా ఆయనకి దక్కుతున్న గౌరవ మర్యాదలు చూసిన తరువాతే, నటుడిగా నా ప్రయాణాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News