అనూ ఇమ్మాన్యుయేల్ కి మరో ఛాన్స్

05-02-2020 Wed 15:17
  • యూత్ లో అనూ ఇమ్మాన్యుయేల్ కి క్రేజ్ 
  •  స్టార్ హీరోలతో చేసినా దక్కని విజయాలు 
  • తాజా చిత్రంపైనే అనూ ఆశలు 

అందం .. అభినయం ఉన్నప్పటికీ అదృష్టం కలిసొస్తేనే ఇండస్ట్రీలో ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతారు. లేదంటే మరో ఇండస్ట్రీని వెతుక్కుంటూ వెళతారు అనేది అక్కడ అనుభవం గడించినవాళ్లు చెప్పేమాట. అనూ ఇమ్మాన్యుయేల్ విషయంలోను అదే జరిగింది. చాలా తక్కువ సమయంలోనే కుర్రకారు మనసులను దోచేస్తూ దూసుకెళ్లింది.

అల్లు అర్జున్ జోడీగా 'నా పేరు సూర్య' .. పవన్ కల్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' చేసే అవకాశాలను సైతం అవలీలగా సంపాదించుకుంది. ఆ సినిమాలు హిట్ అయితే ఆమె పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆ సినిమాలు పరాజయంపాలు కావడంతో రేసులో ఆమె వెనుకబడిపోయింది. తెలుగు నుంచి మళ్లీ ఒక అవకాశం వస్తే బాగుండునని ఆమె అనుకుంటూ ఉండగా, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో రెండవ కథానాయికగా చేసే అవకాశం లభించింది. మొదటి కథానాయికగా నభా నటేశ్ ను తీసుకున్నారు. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.