శ్రీధర్ సీపాన దర్శకత్వంలో చిరంజీవి చిన్నల్లుడి కొత్త చిత్రం!

05-02-2020 Wed 14:47
  • విజేత చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన కల్యాణ్ దేవ్
  • తొలి చిత్రంలోని నటనకు మంచి మార్కులు
  • ఆచితూచి కథలు ఎంచుకుంటున్న మెగా హీరో
  • జీఏ2 బ్యానర్ పై కొత్త చిత్రం

తొలి చిత్రం 'విజేత'తో నటనపరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఇప్పుడు మరో చిత్రంలో నటించనున్నాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. కాగా, కల్యాణ్ దేవ్ కు 'విజేత' చిత్రం ఆశించినంత మార్కెట్ మైలేజీ ఇవ్వని నేపథ్యంలో ఆచితూచి కథలు ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే 'కండోమ్ ఫ్యాక్టరీ' అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. 'మీనాక్షి' అనే సినిమా పట్టాలెక్కించాలని ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదని టాలీవుడ్ టాక్.