ఆయన వైకుంఠం చూపితే.. ఈయన కైలాసం చూపిస్తున్నారు: తులసిరెడ్డి

05-02-2020 Wed 14:41
  • ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ పిట్ట కథలు చెప్పారు
  • హోదా కోసం చిత్తశుద్ధితో పని చేయడం లేదు
  • మూడు రాజధానులు కావాలనుకుంటే ఎన్నికలకు వెళ్లండి

20 మందికి పైగా ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధిస్తామని ఎన్నికల సమయంలో జగన్ పిట్ట కథలు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఇంత మెజార్టీ వచ్చినా హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పారు. అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ గతంలో చంద్రబాబు వైకుఠం చూపారని... ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో జగన్ కైలాసం చూపుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులే కావాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీలు రాష్ట్రానికి దుష్ట త్రయాలుగా తయారయ్యాయని దుయ్యబట్టారు.