లక్ష్యఛేదనలో దీటుగా స్పందిస్తున్న న్యూజిలాండ్

05-02-2020 Wed 14:29
  • హామిల్టన్ లో తొలి వన్డే
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 50 ఓవర్లలో 4 వికెట్లకు 347 పరుగులు
  • లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ కు శుభారంభం

టీమిండియాతో తొలి వన్డేలో న్యూజిలాండ్ లక్ష్యఛేదన దిశగా సాగుతోంది. 348 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టు 34 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ (32), హెన్రీ నికోల్స్ (78) తొలి వికెట్ కు 85 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వీరిద్దరూ వెనుదిరిగినా సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (50 బ్యాటింగ్) క్రీజులో నిలదొక్కుకోవడంతో స్కోరుబోర్డు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం క్రీజులో టేలర్ కు తోడు తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ (26 బ్యాటింగ్) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి 16 ఓవర్లలో ఇంకా 138 పరుగులు సాధించాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.