Naga babu: మీడియాకు భయంకర కరోనా వైరస్‌ సోకిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నాగబాబు

  • కరోనా వైరస్ ప్రజల్లో కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది
  • 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది
  • కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు 
  • మీడియాకు పట్టిన వైరస్‌ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు 

ప్రపంచాన్ని భయపెడుతోన్న కరోనా వైరస్‌ను గుర్తు చేస్తూ మీడియాపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సోకుతున్న కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందేమో కానీ, మీడియాకు పట్టిన వైరస్ వదిలేలా లేదని ట్వీట్ చేశారు.

'కరోనా వైరస్ ప్రజల కంటే మీడియాకే వేగంగా వ్యాపిస్తోంది. 90 శాతం మీడియా ఈ భయంకర వైరస్ బారిన పడింది. కానీ, మరణాల గురించి నిర్ధారణ కాలేదు. నిజమైన కరోనా వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నాను. అయితే, మీడియాకు పట్టిన వైరస్‌ మాత్రం వదులుతుందన్న ఆశ లేదు' అని అన్నారు.

ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు 'హా హా! సూపర్ పంచ్ అన్నయ్య' అని ఒకరు కామెంట్ చేశారు. 'అదిరింది' అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

More Telugu News