నాయిక ప్రాధాన్యత గల సినిమాలో సాయి ధన్సిక

05-02-2020 Wed 13:52
  • తెలుగు తెరకి సాయి ధన్సిక
  • నాయిక ప్రాధాన్యత కలిగిన కథ
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్

తమిళంలో సాయి ధన్సికకి మంచి క్రేజ్ వుంది. ఈ నాజూకు నాయిక .. 'కబాలి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో రజనీకాంత్ కూతురుగా .. మాఫియాకి చెందిన వ్యక్తిగా అదరగొట్టేసింది. అలాంటి ధన్సిక నేరుగా ఒక తెలుగు సినిమా చేయడానికి అంగీకరించడం విశేషం. పీఎస్సార్ కుమార్ నిర్మాణంలో .. హరి అనే నూతన దర్శకుడు నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు.

కొంతసేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు. వినాయక్ క్లాప్ కొట్టగా .. బీవీఎస్ ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'దిల్' రాజు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించాడు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవుతుందనీ, 20 రోజుల పాటు జరుగుతుందని దర్శకుడు హరి చెప్పాడు. ఈ సినిమాలో తను కొత్తగా కనిపిస్తాననీ, తనకి మంచి పేరు వస్తుందని ధన్సిక ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.