America: అమెరికా ప్రజల రక్షణకు తక్షణ ప్రాధాన్యం: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

  • కరోనా విషయంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాం
  • చైనాలో చిక్కుకున్న అమెరికన్లను రప్పించాం
  • డ్రాగన్ కు కూడా పూర్తి సహకారం అందిస్తాం

కరోనా వైరస్‌ నియంత్రణకు తీవ్రంగా పోరాడుతున్న చైనాకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అదే సమయంలో అమెరికన్‌ పౌరుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిన్న ఉభయసభలనుద్దేశించి చేసిన వార్షిక ప్రసంగంలో ట్రంప్‌ తన ప్రభుత్వ విధానాలను వివరించారు. చైనాలో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

కరోనా పుట్టిన వూహాన్‌ నగరంలో చిక్కుకున్న 300 మంది అమెరికన్లను ఇప్పటికే రప్పించామని, ఆమెరికాలో వైరస్‌ ప్రభావం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఏ అంశంలోనైనా అమెరికా పౌరుల రక్షణకే తమ తొలి ప్రాధాన్యమని, ఇరాన్‌ జనరల్‌ ఖాసిం సులేమాన్‌ హత్య కూడా ఆమెరికన్ల రక్షణను దృష్టిలో పెట్టుకునే చేసిందని చెప్పారు.

దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో నిరుద్యోగం ఒకటని, ఈ సమస్యను తన మూడేళ్ల పానలో చాలావరకు పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో తన ప్రభుత్వ ప్రాధాన్యతను సభలో వివరించే ప్రయత్నం ట్రంప్‌ చేశారు.

More Telugu News