మీరూ ఇందులో నిరభ్యంతరంగా చేరొచ్చు: చంద్రబాబుకి విజయసాయిరెడ్డి చురక

05-02-2020 Wed 12:53
  • మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదంటున్నారు
  • చంద్రబాబుది బిజినెస్ మైండ్ కదా?
  • ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు 
  • జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు 

ఆంధ్రప్రదేశ్‌లో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మద్యం ధరలను పెంచేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

'మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూ. తాగడం తగ్గించడం కోసం. సీఎం జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు. మీరూ నిరభ్యంతరంగా చేరొచ్చు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.